స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో


Wed,May 15, 2019 03:14 AM

-టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయంపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, నమస్తే తెలంగాణ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌ పార్టీదేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండలోని ఎమ్మెల్యే చల్లా నివాసంలో పరకాల నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో శాసనమండలి అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ 900 మంది సభ్యులకు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవారే సుమారు 700 మంది ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన వారు 200మంది మాత్రమే ఉన్నారని అన్నారు. దీంతో శాసనమండలి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఇక లాంఛనమే అని చెప్పారు. వరంగల్‌ ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గెలిచినట్లేనని అన్నారు. అనం తరం ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తనకున్న పరిచయాలతో జిల్లాలోని అన్ని గ్రామాల అభివృద్ధికి అధిక శాతం నిధులు తీసుకొస్తానన్నారు. పల్లెల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం సారథ్యంలో ఎమ్మెల్సీ నిధులతో శాసనమండలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం పరకాల నియోజకవర్గంలోని పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు.. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో నియోజకవర్గంలోని పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...