విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట


Wed,May 15, 2019 03:13 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, మే 14 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని పంచాయతీరాజ్‌, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన బేతి సాంబయ్య కుమార్తె బేతి స్ఫూర్తి వర్ధన్నపేటలోని శివాని స్కూల్‌లో చదివి 10/10 జీపీఏ సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం హన్మకొండలోని ఆయన స్వగృహంలో స్ఫూర్తిని అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక గురుకుల పాఠశాలలను ప్రారంభించి పేద కుటుంబాల పిల్లలకు చేయూతస్తోందని వివరించారు. ప్రధానంగా కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలను స్థాపించి ఇంటర్‌ విద్యను కూడా అందిస్తోందని చెప్పారు. దీనివల్ల పేద కుటుంబాల పిల్లలు మంచి విద్యను అభ్యసిస్తూ మంచి ప్రగతి సాధిస్తున్నారని అన్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా నేడు కస్తూర్బా, మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో 10వ తరగతిలో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, అధికారులు కలిసి పనిచేసి వచ్చే విద్యాసంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాని పాఠశాల కరస్పాండెంట్‌ నకిరేకంటి రవీందర్‌, ఉపాధ్యాయుడు సాయిలు, స్ఫూర్తి తండ్రి బేతి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...