ప్రేమించి మోసం చేశాడని యువతి ఆందోళన


Wed,May 15, 2019 03:13 AM

పర్వతగిరి, మే 14 : మండలంలోని అన్నారం షరీఫ్‌ గ్రామంలో సద్దాంఖాన్‌ అనే వ్యక్తి ప్రేమించి మోసం చేసాడని అతడితో వివాహం జరిపించాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన అప్సరాబేగం అనే యువతి సద్దాంఖాన్‌ ఇంటి ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సద్ధ్దాంఖాన్‌ కొంత కాలంగా మాయమాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భం దాల్చేలా చేసాడని ఆరోపించింది. గతంలో ఓసారి పోలీసులను ఆశ్రయించగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తెలిపారు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. పోలీసులు స్పందించి సద్దాంతో పెళ్లి జరిపించి న్యాయం చేయాలని కోరారు. తన తల్లి ఎస్సీ అయినందునే తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదని విచారం వ్యక్తం చేసింది. కాగా సదరు అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్‌ నాయకులు దీక్ష లో పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు బిర్రు మహేందర్‌ మాట్లాడుతూ.. పోలీసులు స్పందించి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన సద్దాం ఖాన్‌తో అప్సరా బేగానికి పెళ్లి చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు మాసాని గోపాల్‌ మాదిగ, గోలి సుధాకర్‌, ధర్మయ్య, రాంచందర్‌, రాజు, సర్పంచ్‌ యశోద, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...