దామెరను అభివృద్ధి చేయడమే లక్ష్యం


Mon,May 13, 2019 03:25 AM

-టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి పోలం కృపాకర్‌రెడ్డి
దామెర, మే 12 : దామెర గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి పోలం కృ పాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామంలో కులమాతలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా నిలుపాలన్నదే తన ధ్యేయమని అందుకోసం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సహాకారంతో అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దామెరుప్పుల శంకర్, మీరాల రవి, సొనబోయిన కొమురయ్య, గుజ్జుల ప్రశాంత్‌రెడ్డి, రావుల స్వామి, గడ్డం సదానందం, ఆలేటి రాజమౌళి, మేరుగు శివ, వంగ రవి, చల్ల రవి, గడ్డం రాజు, మాదరపు అనిల్, వేల్పుల ప్రసాద్, వర్కూటి వీరస్వామి, ఆసోద రవి, నన్నెబోయిన కొమురయ్య, పెరుగు కుమార్, చిలుకల రమేశ్, బైకాని రాజు, బత్తిని పెద్దరాజు, బత్తిని చిన్నరాజు, గోనెల వెంకట్, మేరుగు మల్లయ్య, పెంట రాజు, అల్లం కుమారస్వామి, హింగె నగేశ్, దామెర కుమారస్వామి, హింగె బాబురావు, గోనెల రాజు, తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...