పరకాల మేల్ నర్సుకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం


Mon,May 13, 2019 03:25 AM

పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల సివిల్ ఆస్పత్రి వైద్యశాలలో 9 సంవత్సరాలుగా మేల్ నర్సు (నర్సింగ్ ఆఫీసర్)గా విధులు నిర్వహిస్తున్న సాతూరి సుమన్‌కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ పురస్కారం లభించింది. ప్రపంచ నర్స్‌డేను పురస్కరించుకుని ప్రతీ ఏటా అందించే ఈ అవార్డులకు రాష్ట్రస్థాయిలో ఐదుగురు నర్సులను ఎంపిక చేయగా మిలటరీ నర్సు లుకోస్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వనజ, పరకాల సివిల్ ఆస్పత్రి మేల్ నర్సు సాతూరి సుమన్‌తోపాటు మరో ఇద్దరు ఎంపికయ్యారు. వీరికి ఆదివా రం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అవార్డుల పురస్కారం జరిగింది. ముఖ్యఅతిథిగా తెలంగాణ నర్సింగ్ డైరెక్టర్ అండ్ రిజిస్ట్రార్ విద్యావతిగౌడ్, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ నాయకుడు జూపల్లి రామకృష్ణ, ఎన్‌వోఏ అధ్యక్షుడు రొడావత్ లక్ష్మణ్ చేతులమీదుగా ఉత్తమ అవార్డు గ్రహీతలకు సన్మానం చేయడంతోపాటు అవార్డులను అందించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రాథోడ్, రామకలక్ష్మి, అపోలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర తులసి సుజాత నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రస్థాయి అవార్డుకు సుమన్ ఎంపిక తో సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల సంజీవయ్య, వైద్యులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...