ప్రచారం పరిసమాప్తం..


Mon,May 13, 2019 03:25 AM

-చివరిరోజు హోరాహోరీ
-రేపు మూడో విడత ఎన్నికలు
-జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేల సభలు, సమావేశాలు
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరంగల్ రూరల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగిసింది. వరంగల్ రూరల్ జిల్లావ్యాప్తంగా తుదివిడతలో భాగం గా ఐదు మండలాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థా నాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 16 మండలాలు ఉండగా మొదటి విడతలో ఐదు మండలాల్లో ఈ నెల 6వ తేదీన ఎన్నికలు జరిగా యి. రెండో విడతలో ఆరు మండలాల్లో ఈ నెల 10వ తేదీన ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. మిగిలిన ఐదు మండలాలకు చివరగా ప్రాదేశిక ఎన్నికలు ఈ నెల 14వ తేదీన జరగనున్నాయి. జిల్లాలోని చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూరు, దా మెర, గీసుకొండ మండలాల్లో మూడో విడతలో జరిగే ఎన్నికలతో జిల్లావ్యాప్తంగా ఉన్న 16 మండలాల్లో ఎన్నికలు పరిసమాప్తం కానున్నాయి. మూ డో విడత ఎన్నికలు జరిగే ఈ ఐదు మండలాల్లో ఆదివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది.
జిల్లాలోని చెన్నారావుపేటలో 11ప్రాదేశిక స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం, నెక్కొండ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం, ఆత్మకూరు 9 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థా నం, దామెరలో 8 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం, గీసుకొండలో 9 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5గంటలతో ఎన్నికల ప్రచారం నిలిచిపోయింది. మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్లను గత నెల 30వ తేదీ నుంచి 2వ తేదీ వరకు స్వీకరించారు. నామినేషన్ల పరిశీలనను ఈ నెల 3వ తేదీన నిర్వహిం చారు. ఆమోదించిన నామినేషన్ల వివరాలను ఈ నెల 3వ తేదీన అధికారులు ఆ ఐదు మండలాల్లో ప్రకటించారు. అప్పీళ్లకు ఈ నెల 4వ తేదీన అవకాశం కల్పించారు. వాటి పరిష్కారం 5వ తేదీన నిర్వహించారు. ఉప సంహరణలకు ఈ నెల 2న అవకాశం కల్పించారు. బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఈ నెల 4వ తేదీన ప్రకటించిన అధికారులు ఈ నెల 14న ఎన్నికలు నిర్వహించేందు కు పూర్తి ఏర్పాట్లను చేశారు. మూడో విడత ఎన్నికల ప్రచారం చివరి రోజున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోగల దామెర మండలం లో విస్తృత ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గంలోని దామెర, గీసుకొండ, ఆత్మకూరులలో ప్రచా రం నిర్వహించగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆ నియోజకవర్గంలోని నెక్కొండ, చెన్నారావుపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. జి ల్లావ్యాప్తంగా చివరిరోజు ప్రచారంతో హోరెత్తించారు. జిల్లాలో ఇంటింటి ప్రచారం నిర్వహించా రు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఎన్నికైన ఆయా గ్రామాల స ర్పంచ్‌లు, వార్డు సభ్యుల సహకారంతో ప్రచారం నిర్వహించారు. ఐదు గంటలకల్లా జిల్లావ్యాప్తంగా మూడో విడత ప్రచారం నిలిచిపోయింది.

ప్రచారంలో ముందున్న టీఆర్‌ఎస్..
మూడో విడత ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ తన దూకుడు పెంచింది. జిల్లావ్యాప్తంగా ఐదు మండలాల్లో జరిగే మూడో విడత ఎన్నికలకు సంబంధిం చి జిల్లాలోని శాసనసభ్యులు, జిల్లాకు చెందిన మంత్రి దయాకర్‌రావు, పార్టీ బాధ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల ఇన్‌చార్జిలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. మూడో విడత ప్రాదేశిక ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. ప్రచారంలో ప్రతిపక్షాలు చతికలపడిపోగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ముందువరుసలో నిలిచాయి.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...