మొక్కల పెంపకంపై శ్రద్ధ్ద వహించాలి


Mon,May 13, 2019 03:24 AM

నర్సంపేట రూరల్ : నర్సరీలో మొక్కల పెంపకం పై ఉపాధి హామీ సిబ్బంది, వన సేవకులు ప్రత్యేక శ్రద్ధ్ద వహించాలని ముగ్ధుంపురం గ్రామ సర్పంచ్ పెండ్యాల జ్యోతిప్రభాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారులోని వన్‌జీపీ వన్ నర్సరీని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ.. నర్సరీల్లో పెరిగిన మొక్కలను రానున్న వర్షాకాలంలో గ్రామ ప్రజలకు అందించాలన్నారు. ప్రస్తుత వేసవిలో మండుతున్న ఎండలకు నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షేడ్‌నెట్లు ఏర్పాటు చేసి మొక్కలు ఎండిపోకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నర్సయ్య, ఉప సర్పంచ్ చాందావత్ తిరుపతినాయక్, వార్డు సభ్యులు సదానందం, చాందావత్ విజయ, ఇస్లావత్ రాజన్న, అంజన్‌కుమార్, ఎఫ్‌ఏ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...