కార్పొరేట్‌కు దీటుగా కస్తూర్బా


Sun,May 12, 2019 02:41 AM

-విద్యాలయాల్లో ఆంగ్లమాధ్యమం
-ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం
-జిల్లాలో ఏడు పాఠశాలల్లో ఏడాది నుంచే అమలు
-280మంది బాలికలకు లబ్ధి
-ఏర్పాట్లలో అధికార యంత్రాంగం
-విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కార్పొరేట్ స్థాయిలో వసతుల కల్పన, పౌష్టికాహారం అందించడంతోపాటుగా నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న కస్తూర్బా పాఠశాలలను మరింత పటిష్టం చేయడంతోపాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభీష్టానికి అనుగుణంగా విద్యాబోధనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజు లు చెల్లించుకోలేని స్థితిలో ఉన్న నిరుపేద బాలికలకు కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పాఠశాలల్లో గతేడాది ఇంటర్ విద్య ను కూడా ప్రారంభించింది.
ఇచ్చిన మాటను నిలుపుకున్న సీఎం కేసీఆర్ విద్యార్థుల, తల్లిదండ్రుల కోరిక మేరకు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా నాణ్యతతో కూడిన ఆంగ్ల మాధ్య మ విద్యను అందించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను కూడా చేస్తున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఆం గ్ల మాధ్యమం ప్రారంభించాలని నిర్ణయించింది.

ఈ మేరకు జి ల్లాలో 12 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండగా వాటిల్లో ఏడింట ఈ ఏడాది ఆరో తరగతి నుంచే ఆంగ్ల బోధన ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిం ది. దీంతో ఆంగ్ల మాధ్యమం ఆరో తరగతి నుంచి ప్రవేశపెట్టేందుకు లైన్‌క్లియర్ అయింది. దీనివల్ల జిల్లాలోని ఏడు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో అమలుచేయనున్న ఆంగ్ల బోధనతో 280 మంది విద్యార్థులు ఏడు విద్యాలయాల్లో లబ్ధిపొందనున్నారు. జిల్లాలోని ఆత్మకూరు, వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి, చెన్నారావుపేట, ఖానాపురం, గీసుకొండ మండలాల్లో ఏడు కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఆరో తరగతి ఆంగ్లమాధ్యమం అడ్మిషన్ల స్వీకరణకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు కూడా చేసింది. విద్యాబోధనలో పోటీపడుతున్న ఈ రోజుల్లో మాతృభాషతోపాటు ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంగ్ల మాధ్యమం అమలు విషయంలో బోధకులు కూడా సానుకూలంగా స్పందించడంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా బోధనాపరమైన మెళకువలను వివరించడంతోపాటు ఏడు కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లోని ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై తర్ఫీదును ఇచ్చేందుకు ఈ నెల చివరివారంలో శిక్షణను కూడా ఇవ్వనున్నారు. దీనికి అనుగుణంగా ఆరో తరగతి ఇంగ్లిష్ పుస్తకాలను బోధకులకు అందుబాటులో ఉంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ పుస్తకాలను పరిశీలించిన అనంతరం సందేహాలు, సలహాలు, సూచనలను నోట్ చేసుకుని శిక్షణకు హాజరుకావాల్సి ఉంది.
శిక్షణ కార్యక్రమంలో వీటిని నివృత్తి చేయడంతోపాటు బోధన సిబ్బందికి మెళకువలు కూడా వివరిస్తారు. రాష్ట్ర ఉన్నతాధికారులు ఆంగ్ల బోధన అమలు విషయంలో ప్రత్యేక కమిటీగా ఏర్పడి కమిటీ ఆధ్వర్యంలో ఆరో తరగతి నుంచి ప్రారంభమయ్యే ఈ ఆంగ్ల మాధ్యమ బోధనలో ప్రమాణాలు పాటించడం, నాణ్యతతో కూడి న బోధనను అందించడానికి అవసరమైన చర్య లు తీసుకోనున్నారు.

ఈ ఏడాది ఆరో తరగతిలో ప్రారంభమయ్యే ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులను చేర్పించేందుకు ఇప్పటికే సీటీఆర్‌లు సర్వేలు కూడా చేశారు. విద్యార్థులకు సంబంధించిన తపాలా చిరునామాలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను సేకరించారు. ఆయా పాఠశాలల వారీగా వెళ్లి ఈ ఏడాది ఆరో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభమవుతుందని కూడా చెప్పారు. జూన్ మాసంలో పాఠశాలలో ప్రారంభంతోనే బాలికలు ఈ ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తి కనబర్చేవారిని కస్తూర్బా విద్యాలయాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఏడు కస్తూర్బా విద్యాలయాల్లో 280 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చేరబోతుండడంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆసక్తి, ఆనందం కనిపిస్తున్నది. కస్తూర్బా విద్యాలయాల్లో బాలికలకు చదువు, వసతి, పౌష్టికాహారం అందించడంతోపాటు ఎప్పటికప్పుడూ వారి ఆరోగ్య పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తుండడం, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అడిగిన వెంటనే పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ విద్యా సంవత్సరం నుంచే ఆంగ్లమాధ్యమం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో బాలికలకు తెలుగు మాధ్యమంలో బోధిస్తున్న బోధకులు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...