రక్షణ చర్యలు భేష్


Sun,May 12, 2019 02:39 AM

-స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రత
-రెవెన్యూ, పంచాయతీ సిబ్బందిని భాగస్వామ్యం చేయండి
-పోలీస్ కమిషనర్ విశ్వనాథ రవీందర్
-నర్సంపేట, పరకాల, ఏనుమాములలో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
-డీసీపీ నాగరాజుకు సూచనలు
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి-నమస్తేతెలంగాణ : వరంగల్ రూరల్ జిల్లా ఈస్ట్‌జోన్ పరిధిలో ప్రాదేశిక ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను, ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్, డీసీసీ నాగరాజు శనివారం పరిశీలించారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, తీసుకున్న రక్షణ చర్య లు, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు, వాటిని అనుసందానం చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అమలవుతున్న మూడంకెల రక్షణ వ్యవస్థను పర్యవేక్షించారు. విజిటర్స్ బుక్ నిర్వహణతో పాటుగా ఏర్పాటు చేసిన ప్రతీ సీసీ కెమెరాను క్షుణ్ణంగా పరిశీలించారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలకు సీపీ పలు సూచనలు చేశారు.

అనంతరం జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రాదేశిక ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను కూడా ఆయన పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రక్షణ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదే విధంగా పరకాల పట్టణంలోని గణపతి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. నర్సంపేట, పరకాలలోని స్ట్రాంగ్ రూముల వద్ద రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నపోలీసు సిబ్బందితో పాటు రెవెన్యూ, పంచాయతీ శాఖలకు సంబంధించిన సిబ్బంది కూడా ఉండేలా చూడాలని డీసీపీ నాగరాజును ఆదేశించారు. ఈ మేరకు సంబంధిందిత ఆర్డీవోలతో మాట్లాడాలన్నారు. నర్సంపేట, పరకాల ప్రాదేశిక ఎన్నికల బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకునే చర్యలు, బ్యాలెట్ బాక్సుల రక్షణ చర్యలపై ఆయన డీసీపీ నాగరాజుతో పాటుగా ఏసీపీలు వైవీఎస్ సుదీంద్ర, సునీతమోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఒక ఎస్సై స్థాయి అధికారి స్ట్రాంగ్ రూములలో ఎప్పటికప్పుడూ పరిశీలించాలని సీపీ డాక్టర్ రవీందర్ ఆదేశించారు. భద్రత కల్పనలో పూర్తి జాగ్రత్తలను పాటించాలని అన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...