ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి


Sun,May 12, 2019 02:38 AM

- పరకాల ఆర్డీవో కిషన్
ఆత్మకూరు, మే 11 : ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పరకాల ఆర్డీవో కిషన్ అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన పీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సెక్టోరియల్ అధికారులు, జోనల్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీడీవో నర్మద అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్డీవో కిషన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే ముందుగా సౌకర్యాలను చూసుకోవాలన్నారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు. ఎన్నికల నింబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లు తీసుకవెళ్లినప్పటి నుంచి, తిరిగి రిసీవింగ్ కౌంటర్‌లో అప్పగించే వరకు పోలింగ్ సిబ్బందిదే బాధ్యత ఉంటుందని వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఓటింగ్ రోజున పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరారు. అనంతరం ఏసీపీ సుధీంద్ర మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైన అల్లర్లకు పాల్పడితే తమ సిబ్బంది దృష్టికి తీసుకవెళ్లాలని సూచించారు. సమావేశంలో ఆత్మకూరు, దామెర తహసీల్దార్లు సత్యనారాయణ, నాగరాజు, డీఆర్‌డీఏ ఏపీడీ రమేశ్, సీఐ మహేందర్ పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...