రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం


Sun,May 12, 2019 02:38 AM

-ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
-ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
-ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ప్రచారం
స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తే తెలంగాణ మే11: తెలంగాణలో సీఎం కేసీర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధి ఇప్పగూడెంలో నిర్వహించిన ప్రచార సభలో ముఖ్య అతిథులుగా ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యా రు. వీరికి కోలాటాలు, డప్పు చప్పుళ్లలో గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలోనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయన్నారు. ఇన్నేండ్లు రాష్ర్టాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలన్నారు. నేను ఒకప్పుడు సీపీఎంలో ఉన్నానని ఆ పార్టీ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి సాధించకపోవడంతో టీఆర్‌ఎస్‌లో చేరి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నానన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసిందని, అలాగే రైతు బంధు, రైతు బీమా ప్రవేశపెట్టిందన్నారు. గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు. గ్రామాలు అభివృద్ధి చెం దాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...