సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలి


Sun,May 12, 2019 02:38 AM

-ప్రజల అండతో గులాబీ జెండా ఎగురవేస్తాం..
-టీఆర్‌ఎస్ దామెర జెడ్పీటీసీ అభ్యర్థి గరిగె కల్పనకృష్ణమూర్తి
దామెర, మే 11: ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటాలని టీఆర్‌ఎస్ దామెర జెడ్పీటీసీ అభ్యర్థి గరిగె కల్పనకృష్ణమూర్తి అన్నారు. శనివారం గ్రామంలో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి పోలం కృపాకర్‌రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దామెరుప్పుల శంకర్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలు మహిళా సంఘాలు, యువజన సంఘాలు టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అనంతరం జెడ్పీటీసీ అభ్యర్థి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు చిల్లర మల్లర రాజకీయాలను చేస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దామెరను మండల కేంద్రం చేయడంతోపాటు డబుల్‌లైన్ బీటీ రోడ్డు, నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, ఎమ్మార్సీ భవనం, నూతన తరగతుల నిర్మాణాలు చేపట్టిన ఘనత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికే దక్కిందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కంటి వెలుగువంటి సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకున్న సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. మండలంలోని అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మీరాల రవి, సొనబోయిన కొమురయ్య, గుజ్జుల ప్రశాంత్‌రెడ్డి, రావుల స్వామి, గడ్డం సదానందం, ఆలేటి రాజమౌళి, మేరుగు శివ, వంగ రవి, చల్ల రవి, గడ్డం రాజు, మాదరపు అనీల్, వేల్పుల ప్రసాద్, వర్కూటి వీరస్వామి, ఆసోద రవి, నన్నెబోయిన కొమురయ్య, పెరుగు కుమార్, చిలుకల రమేష్, బైకాని రాజు, బత్తిని పెద్ద రాజు, బత్తిని చిన్నరాజు, గోనెల వెంకట్ , మేరుగు మల్లయ్య, పెంట రాజు, అల్లం కుమారస్వామి, హింగె నగేశ్, దామెర కుమారస్వామి, హింగె బాబురావు, గోనెల రాజు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...