ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక


Sun,May 12, 2019 02:37 AM

చెన్నారావుపేట, మే 11 : మండలంలోని ఖాదర్‌పేట గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు ఎలుగాల చిన్ననర్సయ్య, కాంగ్రెస్ నాయకులు గూడ రాజిరెడ్డి, చింత మహేందర్, కూస సురేశ్, చిరుమిళ్ల సుధాకర్, రాములు, కూస వెంకటేశ్, సింగిరెడ్డి మల్లయ్య, కూస రాజయ్య, దిడ్డి సంతోశ్, వైనాల మల్లయ్య, నాగెల్లి రాములుతోపాటు 30మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు బీరం సంజీవరెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి బానోతు పత్తినాయక్, గ్రామ సర్పంచ్ అనుముల కుమారస్వామి, టీఆర్‌ఎస్ నాయకులు తోట రమేశ్, ఎరుకల రాజ్‌కుమార్, కేశపాక విజేందర్, అరిగెల రాజ్‌కుమార్, మేడిద లక్ష్మణ్, పెంతల రవి, పెండ్లి మల్లయ్య, కుమారస్వామి, సింగిరెడ్డి ప్రతాప్, కొనకటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...