నూతన అంశాలపై శిక్షణ తీసుకోవాలి


Sun,May 12, 2019 02:37 AM

నర్సంపేట రూరల్, మే11: నూతన అంశాలపై అధ్యాపకులు నిరంతరం శిక్షణను తీసుకోవాలని జయముఖి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ పీ రంగయ్య, కళాశాల ప్రిన్సిపాల్ లోక్‌నాథ్‌రావు అన్నారు. మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులు సద్వినియోగం చేసుకుంటే పరిశోధనలకు మరింత చేయూతనందిస్తాయన్నారు. అధ్యాపకులు సాంకేతిక పరంగా కూడా అభివృద్ధి సాధించాలని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు, అధ్యాపకులు మార్పు చెందాలని అన్నారు. అవగాహన సదస్సులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సుల్లో కళాశాల జాయింట్ సెక్రటరీ టీవీఆర్‌ఎన్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ కృష్ణ, హమీద్, వివిధ శాఖల అధిపతులు, విభాగాధిపతులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...