టీఆర్‌ఎస్‌కు ఓటేసి రుణం తీర్చుకోవాలి


Sat,May 11, 2019 02:13 AM

-కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఇక ఏడాదంతా పంటల సాగు
-పెట్టుబడి, 24 గంటల కరెంట్ ఇస్తున్న మహాత్ముడు సీఎం కేసీఆర్
-గత ఎమ్మెల్యే అసమర్థతతో నర్సంపేటలో అభివృద్ధికి బ్రేక్
-ఎన్నికలు ముగిసిన పది రోజుల్లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
-రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీ గుండు సుధారాణి
నెక్కొండ, చెన్నారావుపేట, మే 10 : కాళేశ్వరంతో ప్రాజెక్టు నీటి తో ఇక ఏడాదంతా పంటలు పండుతాయి. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది. ప్రతిపల్లెలోని చెరువులు మత్తళ్లు పోస్తాయి. మరో నెలరోజుల్లోనే సీకేం కేసీఆర్ స్వప్నం నెరువేరడం ఖాయం. పంటలకు పెట్టుబడి, వ్యవసాయానికి 24గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న మహాత్ముడు సీఎం కేసీఆర్‌ను మరువొద్దు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసి సీఎం కేసీఆర్ రుణాన్ని తీర్చుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నెక్కొండ మండలంలోని రెడ్లవాడ, నెక్కొండ, చెన్నారావుపేటలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆయన రోడ్ షోను నిర్వహించారు. నెక్కొండలో బొడ్రాయి నుంచి హైస్కూల్ వరకు, చెన్నారావుపేటలో నూతన సొసైటీ భవనం నుంచి ప్రధాన కూడలి వరకు రోడ్‌షో కొనసాగింది.

ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తికావొస్తున్నాయని, ఇదొక రికార్డు అని సీఎం కేసీఆర్ దక్షతకు నిదర్శనమన్నారు. రైతులకు రైతు బంధు పథకం కింద ఎకరానికి ఎనిమిదివేల రూపాయాలను ఇచ్చేవారమని, ఇప్పు డు రూ. పదివేలకు పెంచుతున్నామని వివరించారు. కాంగ్రెస్ హయాంలో అడుగడుగునా మోటర్లు కాలిపోతుండేవని, మోటారు రిపేర్ల షాపులకు ఎంతో గిరాకీ ఉండేదని, ఇప్పుడు మోటారు రిపేర్ చేసేవారికి పనిలేకుండా పోయిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. గత టీఆర్‌ఎస్ పాలనలో నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎన్ని నిధులు తెచ్చినా.. అసమర్థ ఎమ్మెల్యే ఉండడంతో తెచ్చిన నిధులు వినియోగం కాలేదని, అభివృద్దికి బ్రేక్‌లు పడ్డాయన్నారు. నియోజకవర్గంలో ఐదువేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు తెస్తే నియోజకవర్గంలో ఎక్కడా ఒక్క ఇల్లు కట్టకుండా ఎమ్మెల్యే అభివృద్ధికి అడ్డుపడ్డాడన్నారు. ఎమ్మెల్యేలతో సంబంధంలేని పనులు ముందుకు సాగాయన్నారు. ఇప్పుడు ప్రభుత్వం, ఎమ్మెల్యే ఒక్కరే కావడంతో అభివృద్ధి శరవేగంగా సాగుతోందన్నారు. వరుస ఎన్నికలతో అభివృద్ధి పనులకు బ్రేక్ పడిందన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే దుమ్ముదులిపి అభివృద్ధి పనులను జెట్ వేగంతో ముందుకు తీసుకుపోతామని ఆయన చెప్పారు. పట్టాదారు పాసుపుస్తకాల జారీలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు. రెవెన్యూ అధికారులతో లోటుపాట్లు జరిగాయన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పది రోజుల్లో రైతులందరికి హక్కుపత్రాలు అందించే ఏర్పాటు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.

పట్టాదారు పాసుపుస్తకాలు అందించి పంటలకు పెట్టుబడి అందించే ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. మంత్రిగా తాను, ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్‌రెడ్డి భారీగా నిధులు తీసుకువస్తామని, అయితే స్థానికంగా ప్రజప్రతినిధులు అంతా టీఆర్‌ఎస్ వాళ్లే అయితేనే ఫలితం ఉంటుందన్నారు. నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓసారి పొరపాటు జరిగిందని, నెక్కొండలోని రెండు ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంటేనే అభివృద్ధి పనులు సాగుతాయన్నారు. నెక్కొండ మండలంతో నాకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాదని, భారీ మెజార్టీతో గెలిపించుకొని గౌరవాన్ని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు.

భారీ మెజార్టీలతో నెక్కొండ, చెన్నారావుపేట జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను గెలుచుకుంటే రెండు మండలాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. రోడ్‌షోలో టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సంన్, మాజీ ఎంపీ గుండు సుధారాణి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్‌నబీ, టీఆర్‌ఎస్ నెక్కొండ మండల నాయకులు కొమ్ము రమేశ్‌యాదవ్, చెన్నకేశవరెడ్డి, సొసైటీ చైర్మన్లు రవీందర్‌రెడ్డి, చంద్రయ్య, సంపత్‌రావు, నెక్కొండ జెడ్పీటీసీ అభ్యర్థి లావుడ్య సరోజనహరికిషన్ నెక్కొండ ఎంపీటీసీ అభ్యర్థులు రామారపు పుండరీకం, ఈదునూరి సైదయాకయ్య, రెడ్లవాడ ఎంపీటీసీ అభ్యర్థి దూద్య, టీఆర్‌ఎస్ చెన్నారావుపేట మండల అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి బాల్నె వెంకన్న, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, చెన్నారావుపేట జెడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, జాగృతి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు కొండవీటి ప్రదీప్‌కుమార్, చెన్నారావుపేట జెడ్పీటీసీ అభ్యర్థి బానోతు పత్తినాయక్, ఎంపీటీసీ అభ్యర్థులు అంగోతు మల్కమ్మ, గుండాల మహేందర్, చెరుకుపెల్లి విజేందర్‌రెడ్డి, పసునూటి రమేశ్, ధారావతు శ్రీను, బాదావతు విజేందర్, పర్కాల లక్ష్మీ, కడారి సునీత, మొగిలి రమాదేవి, బోడ కల్పన, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ మహ్మద్ రఫీ, సర్పంచ్‌లు కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, బానోతు రమేశ్, బానోతు లాల్‌సింగ్, మంద జయ, ఎంపీటీసీ మాదాసి కుమారస్వామి, పార్టీ నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, బీరం సంజీవరెడ్డి, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, తొగరు చెన్నారెడ్డి, బోడ బద్దూనాయక్, దుడ్డె వికాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...