ఆదరించండి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతా..


Sat,May 11, 2019 02:12 AM

-చెన్నారావుపేట జెడ్పీటీసీ అభ్యర్థి బానోత్ పత్తినాయక్
చెన్నారావుపేట,మే10: ఆదరించి తనను గెలిపిస్తే చెన్నారావుపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి బానోత్ పత్తినాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మరాయిన్‌పహాడ్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కారు గుర్తుకు ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరిని కలుస్తూ ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి బాల్నె వెంకన్న, జెడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, జాగృతి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు కొండవీటి ప్రదీప్‌కుమార్, భూక్య సాంబయ్యనాయక్, ఏటుకూరి బాలజోజి, అమ్మ రాజేశ్, మురహరి రవి, విజయ్, మల్లవరపు ఇన్నయ్య, పుట్టి భాస్కర్, రెడ్డిమాసి కిశోర్, జోసఫ్, భూక్య కిషన్‌నాయక్, కోరె రమేశ్, అంగోతు వీరాసింగ్, బానోతు గణేశ్, సర్పంచ్‌లు కుండె మల్లయ్య, జాటోతు స్వామి, ఎంపీటీసీ అభ్యర్థి ధారావతు శ్రీను పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...