బాల్యవివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి


Sat,May 11, 2019 02:12 AM

నర్సంపేట రూరల్, మే10 : బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీవో) మహేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం పట్టణంలోని ఆదర్శమండల సమాఖ్య ప్రతినిధులకు బాల్యవివాహాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర, బాలల సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో బాల్యవివాహాలు, అక్రమ దత్తత, బాలకార్మికులు ఎవరైనా ఉంటే వెంటనే జిల్లా అధికారులకు సమాచారం అందించాలన్నారు. అంతేగాక చైల్ట్‌లైన్ 1098టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయ డం వల్ల పిల్లల ఎదుగుదలలోపం, శారీరక, మా నసిక సమస్యలు తలెత్తుతాయన్నారు. వీటి నివారణకు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సోషల్ వర్కర్ రాజ్‌కుమార్, ఏపీఎం కుందేళ్ల మహేందర్, సీసీలు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...