ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం


Sat,May 11, 2019 02:12 AM

శాయంపేట, మే 10 : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైందని శాయంపేట జెడ్పీటీసీ అభ్యర్థి గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని గోవిందాపూర్ గ్రామంలో శుక్రవారం ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ శాయంపేట మండలం నుం చి టీఆర్‌ఎస్ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న తన గెలుపు ఎన్నడో ఖాయమైపోయిందన్నారు. ఈ ఎన్నికల సరళిని చూస్తే వన్‌సైడ్ వార్‌లా మారిపోయిందన్నారు. ఇదే విషయాన్ని అనేక సార్లు ప్రచారంలోనూ తాను చెప్పానన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, నాయకులు ప్రజల్లోకి వెళ్లి చాలా పెద్ద మాటలు చెప్పి మమ్మల్ని విమర్శించారన్నారు. కానీ, పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఏజెంట్లు కూడా లేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే రమణారెడ్డి, తానూ పార్టీలకతీతంగా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేస్తామన్నారు. మండలాన్ని అందరి సహకారంతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బైరి శ్రీను, కుడ్లె సుధాకర్‌రావు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...