సబ్బండ వర్ణాలూ టీఆర్‌ఎస్‌వైపే..


Sat,May 11, 2019 02:12 AM

రాయపర్తి, మే 10 : ప్రత్యేక తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునేందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పక్షాన నిలబడుతున్నారని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని 39 గ్రామాల్లో జరిగిన రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ తీరుతెన్నులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మండలంలోని తిర్మలాయపల్లి, ఊకల్, కాట్రపల్లి, కొండూరు, పెర్కవేడు, మైలారం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్పందిస్తున్న తీరును అంచనా వేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ నాయకులు, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో అంశాలపై చర్చించారు. ఐదేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని సకల వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అమలు చేసిన కార్యక్రమాలే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి అపూర్వ విజయాలను కట్టబెడుతాయన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తన అపార అనుభవంతో సీఎం కేసీఆర్ నూతనంగా చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రజలందరినీ గులాబీ జెండాలకు అభిమానులుగా మార్చుతున్నాయన్నారు. ఈ క్రమంలో మండలంలో జరగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులంతా విజయాలను సాధించి జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల భవనాలపై గులాబీ జెండాలను ఎగురవేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ మండల మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు గుడిపూడి గోపాల్‌రావు, మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, ఆకుల సురేందర్‌రావు, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, గజవెళ్లి అనంత ప్రసాద్, వశపాక కుమారస్వామి, మారయ్య, మల్లయ్య, గజవెళ్లి రామశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...