పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఈస్ట్‌జోన్ డీసీపీ


Sat,May 11, 2019 02:12 AM

శాయంపేట : మండలంలో రెండో విడతలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను ఈస్ట్‌జోన్ డీసీపీ నాగరాజు శుక్రవారం సందర్శించారు. శాయంపేట బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని డీసీపీ సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఓటేసేందుకు వచ్చిన వృద్ధులకు డీసీపీ సహకరించారు. మంచినీటి బాటిళ్లను అందించారు. వృద్ధ మహిళను వీల్‌చైర్‌లోకి ఎక్కించడంలో సహాయపడ్డారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల పట్ల మర్యాధగా వ్యవహరించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట పరకాల ఏసీపీ వైవీఎస్ సుదీంధ్ర, ఎస్సై రాజబాబు తదితరులున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...