పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హరిత..


Sat,May 11, 2019 02:12 AM

వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం హరిత జిల్లాలోని పరకాల, నడికూడ, శాయంపేట, రాయపర్తి, ఖానాపురం, నల్లబెల్లి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఓటర్లతో మాట్లాడారు. స్థానికంగా కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా అక్కడే ఉన్న పోలింగ్ అధికారులతో మాట్లాడడం కనిపించింది. జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన నిర్వహించి పోలింగ్ అధికారులతో సమన్వయం చేస్తూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ఎప్పటికప్పుడూ స్పందించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిని మానిటరింగ్ చేస్తూ గురువారం బ్యాలెట్ బాక్సులు బయలుదేరినప్పటి నుంచి పోలింగ్ నిర్వహణ, బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్‌రూంలకు చేరే వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సురక్షితంగా చేర్చేలా చర్యలు తీసుకున్నారు. రెండో విడత ఆరు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా సమస్యలు తలెత్తలేదని చెప్పారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...