టీఆర్‌ఎస్ వైపే ప్రజలు : ఎమ్మెల్యే పెద్ది


Sat,May 11, 2019 02:11 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు దక్కుతుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లబెల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి-స్వప్న దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి పెద్ది స్వప్న నల్లబెల్లి నుంచి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఐదేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రాంత ప్రజలు కూడా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఓటేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాలకు వెళ్లిన సందర్భంలో ప్రజలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నారని, కారు గుర్తుకు ఓటేస్తామని ముందుకు వస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ గెలుపుకోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. రానున్న ఐదేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. పెరిగిన పింఛన్లు, నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు.

నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రైతు రాజ్యంగా ముందుకు వెళ్తున్నదని అన్నారు. రైతులకు రైతు బంధు పథకంలో ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందిస్తున్నదని వివరించారు. గుంట భూమి ఉన్న రైతులకు కూడా రైతు బీమాను అందిస్తున్నదని అన్నారు. రైతులు అనుకోని పరిస్థితిలో చనిపోతే రూ.లక్షలు అందించి ఆయా కుటుంబాలను ఆదుకుంటున్నదని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌తోపాటు రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సకాలంలో అందించిన ఘనత కూడా టీఆర్‌ఎస్‌దేనని అన్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రజలు అండగానిలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి పెద్ది స్వప్న, పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్‌కుమార్, ఎంపీపీ సారంగపాణి పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...