మలి విడతకు సిద్ధం


Fri,May 10, 2019 03:25 AM

-నేడు ఆరు మండలాల్లో ఎన్నికలు
-63ఎంపీటీసీ స్థానాలకు బరిలో ఉన్న 367మంది
-ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,71,431మంది ఓటర్లు
-367 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు
-బ్యాలెట్ బాక్సులతో కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
-ఎన్నికల విధుల్లో 2,534 సిబ్బంది
-23 అత్యంత సమస్యాత్మకమైన కేంద్రాల గుర్తింపు
-అమలులో 144 సెక్షన్
-ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ హరిత
-పోలీసులకు సహకరించండి : డీసీపీ కేఆర్ నాగరాజు
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరంగల్ రూరల్ జిల్లాలో మలివిడత పోరుకు రంగం సిద్ధం చేశారు. నేడు (శుక్రవారం) జరిగే ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారయంత్రాంగం ప్రకటించింది. శుక్రవారం (నేడు) రెండో విడతలో భాగంగా ఆరు మండలాల్లోని 63ఎంపీటీసీ స్థానాలు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఐదు మండలాల్లో మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసిన అధికారయంత్రాంగం రెండో విడతకు సర్వం సిద్ధం చేసింది. ముందస్తులో భాగంగా సకల ఏర్పాట్లు చేసిన అధికారులు భారీ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను, పత్రాలను, సామగ్రిని, సిబ్బంది ఐదు మండలకేంద్రాల నుంచి ఆరు మండలాలకు తరలించారు. రాయపర్తి, ఖానాపురం, నల్లబెల్లి, శాయంపేట, నడికూడ, పరకాల మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా కొత్త మండలమైన నడికూడకు సంబంధించి ఎన్నికల సిబ్బంది, సామగ్రిని పరకాల మండలకేంద్రం నుంచి పంపిణీ చేశారు. గురువారం సాయంత్రంకల్లా మొత్తం సిబ్బందిని, సామగ్రిని ప్రత్యే క వాహనాల్లో 367పోలింగ్ కేంద్రాలకు చేరవేశారు. జిల్లాలో ని 63ఎంపీటీసీ, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 2534మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.

ఈ ఆరు మండలాల్లో ఓటు హక్కును 1,71,431 మంది ఓటర్లు తమ ఓటు హక్కును నిర్ణీత పోలింగ్ కేంద్రాల్లో వినియోగించుకోనున్నారు. ఈ ఆరు మండలాల్లో అటు అధికారయంత్రాం గం ఇప్పటికే పోల్ చీటీలను పంపిణీ చేసిం ది. ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతీ ఒక్కరిని చైతన్యపరిచింది.
ఈ మేరకు పలు ప్రచార కార్యక్రమాలను నిర్వహించి ప్రచార సాధనాల ద్వారా ప్రజల్లోకి తీసుకవెళ్లింది. ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తున్న తమకు సహకరించి ప్రతీ ఒక్క ఓటరు తన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని ఈ ప్రచారంలో పేర్కొంది. మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా గ్రామసభలు నిర్వహించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొంది. మొత్తం జిల్లాలో మలి విడతలో జరుగుతున్న ఆరు మండలాల ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి 63 ఎంపీటీసీ స్థానాల్లో 367 మంది అభ్యర్థులు బరిలో ఉ న్నారు. ఇక ప్రాదేశిక పోరులో రాజకీయ పార్టీలు పావులు కదుపుతుండగా గురువారం రాత్రి వరకు కూడా గ్రామాల్లో సందడి కనిపించింది.

పోలింగ్ కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు
మలి విడత ఎన్నికలు జరుగుతున్న 367 పోలింగ్ కేంద్రాల్లో జిల్లా ప్రాదేశిక సభ్యులు (జెడ్పీటీసీ), మండల ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీ) ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వరంగల్ రూరల్ జిల్లా అధికారయంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎండలు తీవ్రంగా ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతోపాటు అత్యవసర మందులను అందుబాటులో ఉంచేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చా రు. అంతేకాకుం డా పోలింగ్ కేం ద్రాల వద్ద ఎండ తో ఓటర్లకు ఇ బ్బందికాకుండా టెంట్లు వేయించడం, ఓటర్లు కూర్చునేందుకు కుర్చీలు వేయించడం, చల్లని తాగునీటిని ఓటర్లకు, ఎన్నికల నిర్వహణ సిబ్బందికి అందుబాటులో ఉంచేలా ప్రత్యే క ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వాహన సౌకర్యంతోపాటు వారికి సహాయకులుగా అంగన్‌వాడీ సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను కూడా ఉంచారు.

విధుల్లో 2,534 మంది సిబ్బంది
జిల్లాలోని ఆరు మండలాల్లో జరుగుతున్న ప్రాదేశిక మలి విడత ఎన్నికల్లో అవసరమైన సిబ్బందిని గ్రామాలకు తరలించారు. ఈ ఆరు మండలాల్లోని 367 పోలింగ్ కేంద్రాల్లో బాధ్యతలు నిర్వహించడంతోపాటుగా వివిధ స్థాయిల్లో విధులు నిర్వహించేందుకు మొత్తంగా 2,534 మంది సిబ్బందిని విధుల్లోకి దింపారు. 441 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, 1,652 మంది పోలింగ్ సిబ్బంది, 28 మంది ప్రత్యేక అధికారులను, 412 మంది పోలింగ్ అధికారులను విధుల్లో భాగస్వాములను చేశారు. ఈ మొత్తం సిబ్బంది గురువారం సాయంత్రం నుంచే విధుల్లో చేరిపోయారు.

కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు
వరంగల్ రూరల్ జిల్లాలో జరుగుతున్న మలిదశ పోలింగ్‌లో భాగంగా 23కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. 23పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కాగా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు 40. సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 23గా పోలీసు అధికారులు గుర్తించారు. మొత్తం ఆరు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్న అన్ని గ్రామాల్లో ఐపీసీ144వ సెక్షన్ అమలులో ఉంది. గురువారం సాయంత్రం నుంచే 144సెక్షన్‌ను అమలులోకి తెచ్చారు. అతిసమస్యాత్మకమైన గ్రామాల్లో ప్రత్యేక బలగాలను మొహరించారు. వీటితోపాటు పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలను అప్పటికప్పుడు తరలించేందుకు అందుబాటులో ఉంచారు.

ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ ఎం హరిత
మలి విడత ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశాం. పరకాల, నడికూడ, శాయంపేట, నల్లబెల్లి, ఖానాపురం, రాయపర్తి మండలాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన పీవో, ఏపీవో, ఓపీవోలను నియమించి గురువారం వారికి పోలింగ్ సామగ్రితోపాటు అవసరమైన సిబ్బందిని బ్యాలెట్‌బాక్సులను, పత్రాలను ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు చేరవేశాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన ఏర్పాట్లు చేశాం. జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో ఐదు మండలాల్లో ప్రాదేశిక ఎన్నికలు పూర్తికాగా రెండో విడతలో ఆరు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 1,71,431 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబుతున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పోలీసు సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చాం. పోలింగ్ కేంద్రాల వద్ద వీడియో చిత్రీకరణ, సీసీ కెమోరాలు కూడా ఏర్పాటు చేయించాం.

పోలీసులకు సహకరించండి : డీసీపీ కేఆర్ నాగరాజు
పోలింగ్ కేంద్రాల వద్ద శాంతియుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సహకరించాలి. పరకాల, న ర్సంపేట సబ్ డివిజన్లలో విధి నిర్వహణకు వెళ్తున్న పోలీసులను అప్రమత్తం చే శాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక ఎన్నికల కోసం పోలీసు సిబ్బంది గురువారం నుంచే విధుల్లో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసే మా సిబ్బందికి ప్రజలు సహకరించాలి. ఓటు హక్కు వినియోగానికి వచ్చే ఓటర్లు సెల్‌ఫోన్లతో పోలింగ్‌బూత్‌ల్లోకి వెళ్లకూడదు. 144 సీఆర్‌పీసీ సెక్షన్ అమల్లో ఉంది. ప్రజలు ఎక్కడాకూడా గుమిగూడి ఉండొద్దు. జిల్లాలోని ఏసీపీ సుధీం ద్ర, సునీతామొహన్, సీఐ, ఎస్సైలు, సిబ్బందికి పలు సూచనలు చేశాం. జిల్లా వ్యాప్తంగా వివాదాలను సృష్టించే వ్యక్తులను ఇప్పటికే బైండోవర్ చేశాం. వీరిపై నిఘా కూడా ప్రత్యేక నిఘా పెట్టాం.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...