బాల్యవివాహాల నిర్మూలనకు సహకరించాలి


Fri,May 10, 2019 03:24 AM

-బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, మే 09 : బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు గ్రామస్థాయిలో మహిళా సంఘాలు సహకారం అందించాలని వరంగల్ బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మండల సమాఖ్య మహిళా ప్రతినిధుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రజలు ఇంకా మైనర్లకు వివాహాలు జరిపించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గత వివాహాల సీజన్‌లో రూరల్ జిల్లాలో సుమారు 20 బాల్య వివాహాల వరకు అడ్డుకున్నట్లు తెలిపారు. దీనికి ప్రధాన కారణం కేవలం తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో పాటుగా అమ్మాయిల భారాన్ని తగ్గించుకోవాలనే భావనతోనే వివాహాలు జరిపిస్తున్నారని అన్నారు. అలాగే పేదరికం మూలంగా చదువుకునే వయసులో ఉన్న పిల్లల్ని హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలలో వారి తల్లిదండ్రులు పనులు చేయిస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు ఉన్నట్లయితే వెంటనే 1098 చైల్డ్‌లైన్ టోల్‌ప్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. విషయం తెలియగానే అధికారులు బాలకార్మికులను పాఠశాలల్లో చేర్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తారన్నారు. గ్రామాలో మహిళా సంఘాల సభ్యులు బాల్య వివాహం జరిగే విషయాన్ని తమకు తెలియజేసినట్లయితే వారి వివరాలను ఎవరికీ చెప్పకుండా స్వయంగా అధికారులు గ్రామానికి వచ్చి బాల్య వివాహాన్ని అడుకుంటామని తెలిపారు. బాలల హక్కులు, బాలల దత్తత, వివాహ నమోదు చట్టంపై ఆయన సమాఖ్య సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏపీఎం వేణు, కౌన్సిలర్ నర్సింహస్వామి, సీసీలు, మండల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...