102 సేవలను సద్వినియోగం చేసుకోవాలి


Fri,May 10, 2019 03:23 AM

-ప్రోగ్రామ్ అధికారి బత్తుల ప్రభాకర్
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : పేదలకు మెరుగైన సేవలందించడానికి ప్రభుత్వ దవాఖానలకు అనుబంధగా ఏర్పాటు చేసిన 102 వాహనాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ప్రోగామ్ అధికారి బత్తుల ప్రభాకర్ కోరారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో గురువారం ఆకస్మికంగా 102 వాహనాన్ని తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే వాహనంలో ఏర్పాటు చేసిన పరికరాల పనితీరును ఆయన పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో గర్భిణిగా పేరు నమోదు చేసుకున్ననాటి నుంచి ప్రసవం వరకు గర్భిణులు102 వాహనాలను ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రసవం అనంతరం కూడా దవాఖాన నుంచి వాహనంలో ఉచితంగా తీసుకువెల్లి ఇంటి వద్ద తల్లీబిడ్డలను సురక్షితంగా చేర్పిస్తామన్నారు.అలాగే జీవీకే సంస్థ ద్వారానే 108 వాహనాలను కూడా నిర్వహిసున్నామన్నారు. ప్రభుత్వం సదాశయంతో ఏర్పాటు చేసిన ఈ 102, 108 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన వాహనంలో ఉన్న అన్ని పరికరాలతో పాటుగా ప్రథమ చికిత్సకు అవసరమైన మందులను పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ప్రభాకర్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ గుగులోతు శ్రీనివాస్, ప్లీట్ కో-ఆర్డినేటర్ రాజేశ్‌యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...