ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి


Fri,May 10, 2019 03:23 AM

పరకాల, నమస్తే తెలంగాణ: రెండో విడతలో భాగంగా ఈస్ట్‌జోన్ పరిధిలోని మండలాల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ కేఆర్ నాగరాజు అన్నారు. గురువారం పరకాల పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ సుధీంద్రతో కలిసి ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందితో డీసీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించి కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే మహిళలు, వృద్ధులతో మర్యాదగా మాట్లాడడంతోపాటు వారికి సహాయపడాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు క్యూ పద్ధతిలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలు, సిరా బాటిళ్లతోపాటు మరే ఇతర ద్రవరూప పదార్థాలను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీఐ మధు, డివిజన్ పరిధిలోనిసీఐలు,ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఖానాపురం : మండలంలో రెండోవిడతలో జరుగనున్న ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టాలని డీసీపీ నాగరాజు అన్నారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎన్నికల విధులకు హాజరైన పోలీసు సిబ్బందితో డీసీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు, సలహాలను అందజేసారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ పూర్తయి బ్యాలెట్ బాక్స్‌లు తరలివెళ్లేదాకా విధులను అప్రమత్తంగా నిర్వహించాలన్నారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధ్దంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ సునితామోహన్,దుగ్గొండి సీఐ సతీష్‌బాబు,ఎస్సై మ్యాక అభినవ్,్ర టైనీ ఎస్సై నాగరాజు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...