దామెర మండల అభివృద్ధే లక్ష్యం


Fri,May 10, 2019 03:22 AM

-జెడ్పీటీసీ అభ్యర్థి గరిగె కల్పనకృష్ణమూర్తి
దామెర, మే 9 : దామెర మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తూ జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి గరిగె కల్పనకృష్ణమూర్తి అన్నారు. గురువారం ముస్త్యాలపల్లి, తక్కళ్లపహాడ్, దుర్గంపేట తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సహకారంతో దామెర, ల్యాదెళ్ల, ముస్త్యాలపల్లి, కోగిల్వాయి, వెంకటాపురం, సింగరాజుపల్లి, దుర్గంపేట, దమ్మన్నపేట, సీతారాంపురం, ఊరుగొండ, ఒగ్లాపురం, తక్కళ్లపహాడ్, వెంకటాపురం, పులుకుర్తి గ్రామాలకు ప్రత్యేక నిధులను తీసుకువచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించడంతోపాటు తాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. వృద్ధ్దులు, వితంతువులు, వికలాంగులను ఆదుకుంటానని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. . కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితోనే దామెర మండలం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రచారంలో సర్పంచ్ శ్రీనివాస్, యాదారాజేశ్వరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...