ఎస్సారెస్పీ జలాలతో చెరువులకు మత్తళ్లు : పెద్ది


Fri,May 10, 2019 03:22 AM

నెక్కొండ, మే 09: నెక్కొండ మండలంలో ప్రవహిస్తున్న వట్టెవాగుపై పలుచోట్ల చెక్‌డ్యాంలను నిర్మించేందుకు రంగం సిద్ధమైంది.. ఎస్సారెస్పీ జలాలను నింపి అన్ని గ్రామాల్లోని చెరువులు మత్తళ్లు పోసేలా కృషిచేస్తా.. నెక్కొండ మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని దీక్షకుంట, ముదిగొండ, గొల్లపల్లి, చంద్రుగొండ, సూరిపల్లి, నాగారం, పెద్దకొర్పోలు, గుండ్రపల్లి, రెడ్లవాడ, గొట్లకొండ, అలంఖానిపేట, అప్పల్‌రావుపేట గ్రామాల్లో గురువారం ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జెడ్పీటీసీ అభ్యర్థి లావుడ్య సరోజన హరికిషన్‌తో కలిసి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు చేస్తున్న ప్రణాళికలకు అనుగుణంగా మండలంలోని వట్టెవాగుపై చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.37 కోట్లు మంజూరయ్యాయన్నారు. చంద్రుగొండ, పనికర, సూరిపల్లి గ్రామాల సమీపంలో ప్రవహించే వట్టె వాగుపై చెక్‌డ్యాంలను నిర్మిస్తామని తెలిపారు. చిన్నకొర్పోలు-పెద్దకొర్పోలు గ్రామాల మధ్య వట్టెవాగుపై చెక్‌డ్యాం, బ్రిడ్జి నిర్మాణం, పెద్దకొర్పోలు-నాగారం గ్రామాల మధ్య వట్టెవాగుపై చెక్‌డ్యాం, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాని చెప్పారు. సాంకేతిక అనుమతులు మరో పదిహేను రోజుల్లో రానున్నట్లు తెలిపారు. గోదావరి జలాలతో మండలంలోని అన్ని చెరువులను మత్తళ్లు పడేవిధంగా నింపుతామని, ఉగాది పర్వదినం వరకు మండలం జలకళతో సస్యశ్యామలమవడం ఖాయమన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్‌లందరూ టీఆర్‌ఎస్ వారేనని, ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ టీఆర్‌ఎస్ వారే కావాలన్నారు. ప్రజాప్రతినిధులందరూ మన వారు అయితేనే అభివృద్ధి ఫలాలు ప్రజల దరిచేరుతాయని ఎమ్మెల్యే పెద్ది చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వేర్వేరు పార్టీలకు చెందిన వారైతే కాళ్లల్లో కట్టెలు పెట్టినట్లవుతుందన్నారు.

త్వరలోనే యాదవులకు రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి ఎంపీటీసీ పరిధిలో వంద వరకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టాలని కోరారు. పార్టీ విధేయులకు సముచితస్థానం కల్పిస్తామని, వరుస ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి పనులకు కొంత వరకు బ్రేక్ పడిందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు పథకం, రైతు బీమా పథకాలను అమలు చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పెద్ది వివరించారు. ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జెడ్పీటీసీ లావుడ్య సరోజనహరికిషన్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు కొండంత అండగా ఉంటున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్ హయాంలో నెక్కొండ అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన దూసుకు పోతోందన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్‌నబీ, మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ సారంగపాణి, మండల నాయకులు కొమ్ము రమేశ్‌యాదవ్, తాటిపెల్లి శివకుమార్, సురేశ్, చంద్రుగొండ ఎంపీటీసీ సభ్యుడు సంగని సూరయ్య, పెద్దకొర్పోలు సర్పంచ్ మహబూబ్‌పాషా, ఎంపీటీసీ అభ్యర్థి సుకన్య, ఇంద్రసేనారెడ్డి, రాంచందర్, గుండ్రపల్లి సర్పంచ్ బొంపెల్లి రాజేశ్వర్‌రావు, అప్పల్‌రావుపేట సర్పంచ్ వడ్డె రజితసురేశ్, అలంకానిపేట సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మిరవి, సొసైటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, శ్రీకాంత్,మండల నాయకులు చెన్నకేశవరెడ్డి, సూరం రాజిరెడ్డి, రాంగోపాల్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...