పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి


Fri,May 10, 2019 03:21 AM

దామెర, మే 09: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలదరికి చేరాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని పులుకుర్తిలో గురువారం జరిగిన టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. అంతకు ముందుకు టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి గోవింద్ సంధ్యఅశోక్‌కు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం, కళ్యాణలక్ష్మి, వృద్ధులు, వింతంతువులు, దివ్యాంగులను ఆదుకునేందుకు ఆసరా వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. దేశం మొత్తం సీఎం కేసీఆర్‌వైపే చూస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందని, దీంతో మన గ్రామాలు కోనసీమను తలపించే విధంగా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు పులి సారంగపాణి, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు ముదిగొండ కృష్ణమూర్తి, సర్పంచ్ అశోక్, ఇన్‌చార్జి దొమ్మాటి సంపత్, మండల ప్రధాన కార్యదర్శి దామెరుప్పుల శంకర్, రైతు సమితి కన్వీనర్ బిల్లా రమణారెడ్డి, నాయకులు భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ సుమలత, దండు రాజు, ఎడ్లగోపాల్, రాగమయి. రమేష్, పెరక సత్యం, రఘు, కొత్త భాస్కర్, పెంచాల రవి, సుదర్శన్, శాంతికుమార్, కుంటమల్ల రాజు, పెరక వేణు, అరుణదయాకర్ పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...