ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించండి


Thu,May 9, 2019 02:21 AM

-టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి గండ్ర జ్యోతి
శాయంపేట, మే 8 : ఆడబిడ్డగా ఆదరించి మండల జెడ్పీటీసీగా గెలిపించాలని టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని వసంతాపూర్, ప్రగతిసింగారం గ్రామంలో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి పనులు జరిగే చోటకు వెళ్లి కూలీలను ఓటు అభ్యర్థించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రెండు ప్రధాన పార్టీలు ఏకమైయ్యాయని నియోజకవర్గంలో వేరే పార్టీకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశామన్నారు. మండలంలో తమ గెలుపు ఖాయమైందన్నారు. తమపై ఎవరికి ఎలాంటి సందేహం ఉండవద్దన్నారు. కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్‌ఎస్‌లోకి ఎందుకు వెళ్లారన్న సందేహాలున్నాయన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గాలి వీచి తొంభై సీట్లు గెలిచిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభంజనంలో భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఆ సమయంలో నియోజకవర్గానికి అనేక అభివృద్ధి పనులు చేస్తామని రైతులకు, యువకులు, మహిళలకు హామీలు ఇచ్చామన్నారు.. భూపాలపల్లి జిల్లాలో ఔటర్ రింగ్‌రోడ్డు, మెడికల్ కాలేజి, రోడ్లు, బ్రిడ్జీలు తీసుకొస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే, నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరగాలంటే టీఆర్‌ఎస్‌లోకి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు కేసీఆర్ ఆహ్వానం మేరకు చేరినట్లు తెలిపారు. మమ్మల్ని అర్థ్ధం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షం లేదు కాబట్టి తాము పార్టీ మారామన్నారు. పరిషత్ ఎన్నికలు రావడం అధిష్టానం ఆదేశాలు రావడంతో విబేధాలు రాకుండా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశాలతో ఇక్కడికి వచ్చామన్నారు. రూరల్ జిల్లా నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ ఉండాలని కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు వచ్చి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ మారాలంటే ఈజీగా మారే వాళ్లం కాదని ప్రజలు అర్థ్దం చేసుకోవాలన్నారు. జెడ్పీటీసీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...