ముగిసిన ప్రచారం


Thu,May 9, 2019 02:21 AM

పరకాల, నమస్తే తెలంగాణ : ప్రాదేశిక ఎన్నికల్లో రెండో విడత ప్రచా రం పరకాల డివిజన్‌లోని మూడు మండలాల్లో ముగిసింది. పరకాల, నడికూడ, శాయంపేట మండలాల్లో రెండో విడతలో భాగంగా ఎన్నికలు ఈ నెల 10న జరుగనున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 26వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 2వ తేదీతో నామినేషన్ల ఉప సంహరణ ఘట్ట ముగిసింది. రాజకీయ పార్టీల గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో నామినేషన్ల ఉప సంహరణ అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మరుసటి రోజు నుంచే అభ్యర్థులు ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డీలాపడ్డాయి. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. గ్రామాల వారిగా ఇన్‌చార్జిలను నియమించుకున్న టీఆర్‌ఎస్ ఒక్కో ఇంటికి రెండు నుంచి మూడుసార్లు వెళ్లి ఓటర్లను కలుసుకుంది. పరకాల, నడికూడ మండలాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగింది. బుధవారం సాయంత్రం 5 గంటల తరువాత ప్రచార మైకులు మూగబోయాయి. కాగా, నేడు (గురువారం) ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనుండగా 10వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...