పంజాబ్ ఆగ్రోస్‌ను సందర్శించిన రాష్ట్ర బృందం


Thu,May 9, 2019 02:21 AM

వరంగల్ క్రైం, మే 08: పంజాబ్‌లోని ఆగ్రోస్‌శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగపల్లి కిషన్‌రావు ఆధ్వర్యంలో అధి కారుల బృందం బుధవారం సందర్శించింది. చైర్మన్ లింగపల్లితో పాటు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్, జనరల్ మేనేజర్ చంద్రరాజుమోహన్ మూడు రోజులపాటు పంజాబ్‌లో పర్యటించి పలు అంశాలను తెలుసుకున్నారు. హోషియర్ జిల్లాలోని పుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు బెవరేజ్ జ్యూస్ యూనిట్, లూథియానా జిల్లాలోని ఆగ్రోస్ పెట్రోల్‌పంపు, పుడ్‌పార్కు, మార్క్‌ఫెడ్ ప్యాకింగ్ హౌస్, పసుపు ఉత్పాదన కర్మాగారం, పండ్లు, కూరగాయాల రసాల కర్మాగారాలను సందర్శించారు. వాటి నిర్వహణపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...