పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల


Thu,May 9, 2019 02:21 AM

-ఖర్చుల వివరాలు అందించాలి
చెన్నారావుపేట,మే 08 : మండల పరిషత్ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసిన 45 రోజుల్లో తమ ఖ ర్చుల వివరాలు అందించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు కేశవానందకుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీలుగా పోటీచేసే అభ్యర్థులు రూ.4 లక్షలు, ఎంపీటీసీలుగా పోటీచేసే అభ్యర్థులు రూ.1.50లక్షల లోపు మా త్రమే ఎన్నికల్లో ఖర్చు చేయాలన్నారు. ఎక్కువగా ఖర్చు చేసినైట్లెతే వారి ఎన్నిక చెల్లనేరదన్నారు. ఓడిన వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రతీ ఒక్కరూ ఎన్నికల ని యమ నిబంధనలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో లైజన్ ఆఫీసర్ సత్యనారాయణ, మండల ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్, జిల్లా అధనపు ఎన్నికల సహాయ అధికారి కొర్ని చందర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...