కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష


Thu,May 9, 2019 02:20 AM

-మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
శాయంపేట, మే 08 : రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాజీ స్పీకర్‌సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పరిషత్ ఎన్నికల ప్రచారంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి పనులు జరిగే చోటకు వెళ్లి పనులు చేశారు. కారు గుర్తుకు ఓటెయ్యాలని కూలీలను కోరారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ పాలనతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు అనుగుణంగా పథకాలు అమల్లోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. మరోపార్టీకి అవకాశం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలే ప్రజల్లో టీఆర్‌ఎస్ బలంగా ఉండేందుకు కారణమైందన్నారు. కేసీఆర్ పాలన రాష్ట్రంలో మరో యాభై ఏండ్లు ఉంటుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసర పింఛన్లు, దళితులకు భూమి పంపిణీ, డబుల్ బెడ్రూంలు, సర్కార్ దవాఖానల్లో ప్రసవాలకు కేసీఆర్ కిట్ అందజేత, సర్కార్ బడుల్లో చదువుతున్న పిల్లలకు సన్నబియ్యం తో అన్నం ఇలా అనేక ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలను ఆచరణలోకి తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనూ కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీరాదని కేసీఆర్ నేతృత్వంలోని ఫడర్‌ఫ్రంట్ అధికారంలోకి వస్తుందన్నారు. రైతులను మరింతగా ఆదుకునేందుకు రైతుబంధు నిధులను పెంచుతున్నట్లు చెప్పారు. నిరుద్యోగులను కూడా భృతి ఇచ్చి ఆదుకుంటుందన్నారు. గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే టీఆర్‌ఎస్‌నే గెలిపించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, గంటా శ్యాంసుందర్‌రెడ్డి తదితరులున్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...