స్క్రీనింగ్ క్యాంపును తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో


Thu,May 9, 2019 02:20 AM

పరకాల, నమస్తే తెలంగాణ : నడికూడ మండలంలోని రాయపర్తి పీహెచ్‌సీ పరిధిలోని పోచారం గ్రామంలో జరుగుడుతున్న ఎస్‌సీడీ స్క్రీనింగ్ క్యాంపును బుధవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్యామనీరజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామస్తులకు పీహెచ్‌సీ వైద్యాధికారులు అందిస్తున్న సేవలను గురించి అక్కడున్నవారిని అడిగి తెలుసుకున్నారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్ టెస్టుల్లో భాగంగా బుధవారం 98 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. రాయపర్తి వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్‌కుమార్ చెక్కర వ్యాధి, హైపర్ టెన్షన్ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలను చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో పలు సూచనలు చేశారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో విధిగా అసంక్రామిత వ్యాధుల నిర్ధార ణ పరీక్షలను నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, సబ్ యూనిట్ ఆఫీసర్ విజేంద్రకుమార్, హెచ్‌వీ ఎలిజబెత్, శ్రీలత, రవీందర్, శ్రీనివాస్, ఏఎన్‌ఎంలు ఇందిర, కరుణ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...