భూమికి పక్కా లెక్క..


Fri,April 26, 2019 01:33 AM

రూరల్ కలెక్టరేట్, ఏప్రిల్ 25 : జిల్లాలోని భూమికి లెక్క పక్కాగా ఉండాలని కలెక్టర్ హరిత అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ధరణికి సంబంధించిన వివిధ అంశాలపై గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరిత మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. జిల్లాలో 5,10,113 ఎకరాల భూమి విస్తీర్ణం ఉండగా ఇప్పటి వరకు 3,18,767 ఎకరాల భూమికి మాత్రమే డిజిటల్ సంతకాలు జరిగాయన్నారు. మిగతా భూమి గురించి మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ సంతకం కాకుండా మిగిలి ఉన్న భూమిని వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామాల వారీగా పాట్ ల్యాండ్ వివరాలను త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించి రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన నివేదికలకు పొంతన కుదరడం లేదన్నారు. వేసవిలో కార్యాలయాలకు వచ్చేవారి కోం చలివేంద్రాలు, నీడ సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జేసీ రావుల మహేందర్‌రెడ్డి, డీఆర్‌వో హరిసింగ్, పరకాల, నర్సంపేట, రూరల్ ఆర్డీవోలు కిషన్, రవి, మహేందర్‌జీ, తహసీల్దార్లు పాల్గొన్నారు.

పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
జిల్లాలో జరిగే పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను చేయాలని ఎన్నికల అధికారులను కలెక్టర్ హరిత ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రెండో విడత, మూడో విడత ఎన్నికలు జరిగే మండలాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలకు నామినేషన్, ఎన్నిక ప్రక్రియపై ఏమైనా అనుమానాలు తలెత్తితే వెంటనే మొదటి విడత నిర్వహించిన రిటర్నింగ్ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో లైజనింగ్ అధికారి, డీఆర్‌డీవో సంపత్ రావు, రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...