ఆధ్యాత్మికంతోనే మానసిక ప్రశాంతత


Thu,April 25, 2019 03:22 AM

సంగెం, ఏప్రిల్ 24 : ఆధ్యాత్మికతతోనే మనసు ప్రశాంతంగా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సంగెంలో ఈ నెల 29 నుంచి నిర్వహించనున్న శతచండీ మహాయాగం బ్రోచర్‌ను బుధవారం హన్మకొండలోని మంత్రి నివాసంలో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సంగెంలో శతచండీ మహాయాగం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు ఈ యాగం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సంగమేశ్వరాయలంలో నిర్వహించే శతచండీ మహాయాగానికి తప్పనిసరిగా తాను హాజరవుతానని తెలిపారు. మే 3తేదీ వరకు ఈ యాగం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కందకట్ల నరహరి, ప్రధాన అర్చకుడు అప్పె నాగార్జునశర్మ, సర్పంచ్ బాబు, కోటేశ్వర్, వినోద్, సదయ్య, పులి వీరస్వామి, ఆగపాటి రాజ్‌కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...