జోరుగా మొదటి విడత నామినేషన్లు


Thu,April 25, 2019 03:21 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని నర్సంపేట, దుగ్గొండి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం మండలాల్లో చివరి రోజు బుధవారం నామినేషన్లను భారీగా దాఖలయ్యాయి. నర్సంపేట మండలంలో ఒక జెడ్పీటీసీ స్థానం, 11 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 73 నామినేషన్లు దాఖలయ్యాయి. నర్సంపేటలో ఎంపీటీసీ స్థానాలకు 62 మంది అభ్యర్థులు 64 నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. ఇక ఒక జెడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు 12 నామినేషన్లు దాఖలు చేశారు. దుగ్గొండి మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు 86 నామినేషన్లు, ఒక జెడ్పీటీసీ స్థానానికి 11 నామినేషన్లు దాఖలయ్యాయి. పర్వతగిరి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 90 మంది అభ్యర్థులు 106 నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. ఒక జెడ్పీటీసీ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు 15 నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. ఇక సంగెం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 76 మంది అభ్యర్థులు 80 నామినేషన్లు వేశారు. ఒక జెడ్పీటీసీ స్థానానికి 9 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇక వర్ధన్నపేట మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు 70 నామినేషన్లు దాఖలు చేశారు. ఒక జెడ్పీటీసీ స్థానానికి 16 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తయింది.

నామినేషన్ల పరిశీలనకు ఏర్పాట్లు..
నామినేషన్ల పరిశీలనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐదు మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లను స్వీకరించిన అధికారులు ఆయా కౌంటర్ల వద్దనే గురువారం నామినేషన్ల పరిశీలన పూర్తిచేస్తారు. తుది జాబితాను కూడా సిద్ధం చేస్తారు. ఈ మేరకు నామినేషన్ల పరిశీలన కోసం అధికారులు ఏర్పాట్లను కూడా పూర్తిచేశారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...