సర్వేలో పూర్తి సమాచారం ఇవ్వాలి


Thu,April 25, 2019 03:21 AM

పరకాల, నమస్తే తెలంగాణ : గ్రామాల్లో ఏఈవోలు చేపడుతున్న రైతు సమగ్ర సర్వేలో రైతులు తమ పూర్తి సమాచారాన్ని అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ అన్నారు. బుధవారం పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో కొనసాగుతున్న రైతు సమగ్ర సర్వేను జేడీఏ సందర్శించారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడుతూ.. సమగ్ర సర్వేతో పంట కాలనీలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించేందుకు వీలు ఉంటుందని అన్నారు. మార్కెట్లో పంట అమ్మిన వెంటనే రుసుము చెల్లించేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. ప్రతీ రైతు తన ఇష్టాఅయిష్టాలను సర్వే ద్వారా వ్యక్తపరిచినప్పుడే విలువ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలనేది నిర్ణయించడానికి వీలవుతుందన్నారు. మే 20వ తేదీలోగా ప్రతీ రైతు తమ సమగ్ర సమాచారాన్ని అధికారులకు అందజేయాలని కోరారు. అనంతరం రైతులు అడిగిన సందేహాలను జేడీఏ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏడీఏ విద్యాసాగర్, ఏవో శ్రీనివాస్, ఏఈవో అరుణ్‌కుమార్, వెల్లంపల్లి సర్పంచ్ వెలగందుల కృష్ణ, రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, మల్లయ్య, రైతులు భగవాన్‌రెడ్డి, వేణు, జయపాల్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మంద పాపయ్య, కొంరారెడ్డి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి కృషి ..
దామెర : రైతు సంక్షేమానికి ప్ర భుత్వం అనేక విధాలుగా కృషి చే స్తూ పంట ఉత్పత్తులను పెంచేందు కు తగిన చర్యలు తీసుకుంటున్నదని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. జాతీయ అహార భద్రత పథకాన్ని పురస్కరించుకుని రూరల్ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామాల్లో రైతు పున్నం వెంకటేశ్వర్లు పండిస్తున్న చిరుధాన్యాల పంటలను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిస సమావేశంలో ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులకు కావాల్సిన చిరుధాన్యాలను ప్ర భుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. ఇందుకోసం ప్రతీ రైతు చిరుధాన్యాలను తమ పంటపొల్లాల్లో విత్తేందుకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలను అందించేందుకు సిద్ధ్దంగా ఉందని తెలిపారు. స్వయం ప్రతిపత్తితో కూడిన రైతులందరు ఓకే తాటిపై ఉండాలన్నారు. నల్లరేగడి భూములతోపాటు చౌకభూముల్లో రాగులు, సజ్జలు తదితర పంటలను సాగు చేస్తే ఆర్థికంగా రాబడి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్ సాంబయ్య, ఎంపీటీసీ సంపత్, పున్నం నాగరాజు, ప్రభాకర్‌రెడ్డి, ఏఈవో పవన్ పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...