ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయం


Thu,April 25, 2019 03:21 AM

పరకాల, నమస్తే తెలంగాణ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయఢంకా మోగించడం ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, నడికూడ మండలాల టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందే వారికే పార్టీ టికెట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తప్పనిసరిగా తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. టికెట్ రానివారు నిరాశ చెందవద్దన్నారు. టికెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పరకాల, నడికూడ జెడ్పీటీసీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేయాలన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి పులి సారంగపాణి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భీముడి నాగిరెడ్డి, నాయకులు బొజ్జం రమేశ్, ఎర్రబెల్లి తిరుపతిరెడ్డి, నేతాని శ్రీనివాస్‌రెడ్డి, మునిగాల సురేందర్‌రావు, చింతిరెడ్డి సాంబరెడ్డి, తిప్పర్తి సాంబశివరెడ్డి, నందికొండ జైపాల్‌రెడ్డి, పర్నెం తిరుపతిరెడ్డి, పల్లెబోయిన అశోక్, పల్లెబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే
టీఆర్‌ఎస్ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు. పరకాల జెడ్పీటీసీగా వెంకటాపురం గ్రామానికి చెందిన సిలువేరు మొగిళి, వెల్లంపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా బరిగెల మౌనిక, పోచారం గ్రామానికి కోరె రమే శ్, నాగారానికి చింతిరెడ్డి మధుసుదన్‌రెడ్డి, లక్ష్మీపురానికి పల్లెబోయిన సునీత, మల్లక్కపేట అభ్యర్థిగా బొజ్జం రజితను ప్రకటించారు. అలాగే, నడికూడ జెడ్పీటీసీగా నర్సక్కపల్లె గ్రామానికి చెందిన కోడెపాక సుమలత, నడికూడ ఎంపీటీసీ అభ్యర్థిగా దురిశెట్టి చంద్రమౌళి, చౌటుపర్తికి కాకర్ల కౌసల్య, నర్సక్కపల్లెకు వరికెల విజయ, కౌకొండకు మేకల సతీశ్, రాయపర్తికి పోశాల సరిత, నార్లాపూర్‌కు మచ్చ అనసూర్య, వరికోలుకు చంద కుమారస్వామి, చర్లపల్లి అభ్యర్థిగా నందికొండ సుగుణను ఎంపిక చేశారు.

గీసుగొండపై గులాబీ జెండా ఎగరాలే
గీసుగొండ : గీసుగొండలో గులాబీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై గీసుగొండ మండల సమన్వయ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ సూచించిన వారినే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ పటిష్టతకు పనిచేసే వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. అప్పుడే పార్టీ అభ్యర్థులు అత్యధిక మోజార్టీతో గెలుస్తారని చెప్పారు. కార్యక్రమంలో పులి సారంగపాణి, పార్టీ మండల అధ్యక్షుడు పోలీసు ధర్మారావు, కార్యదర్శి జైపాల్‌రెడ్డి, వీరాగోని రాజుకుమార్, ముంతరాజయ్య, గుర్రం రఘ, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...