నామినేషన్ల జోరు..


Wed,April 24, 2019 03:23 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఘట్టం జోరుగా కొనసాగుతోంది. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజు ఐదు మండలాల్లోని ఐదు జెడ్పీటీసీ స్థానాలకు, 62 ఎంపీటీసీ స్థానాలకు గానూ 35 ఎంపీటీసీ నామినేషన్లు, 6 జెడ్పీటీసీ నామినేషన్లు దాఖ లా అయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మొదటి విడత లో ఎన్నికలు జరుగుతున్న దుగ్గొండి, నర్సంపేట, పర్వతగిరి, సంగెం, వర్ధన్నపేట మండలాల్లో 62 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాలకు అధికారులు 22, 23, 24వ తేదీల్లో మూడు రోజులపాటు ఈ నామినేషన్లను స్వీకరించనుండగా ఇప్పటికే రెండు రోజులు పూర్తయింది. నేటి (బుధవారం) తో నామినేషన్ల దాఖలా ప్రక్రియ పూర్తికానుంది.

రెండో రోజు మంగళవారం పర్వతగిరి మండలంలో జె డ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నాలుగుసెట్ల నామినేషన్ దాఖలా చేయగా 12 ఎంపీటీసీ స్థానాలకు గానూ 16 నామినేషన్లు దాఖలా చేశారు. అదేవిధంగా దుగ్గొండి మండలంలో ఒక జెడ్పీటీసీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్య ర్థి ఒక నామినేషన్ దాఖలా చేయగా ఎంపీటీసీ స్థానాలకు ఏడు నామినేషన్ పత్రాలను ఐదుగురు అభ్యర్థులు దాఖలా చేశారు. ఇక వర్ధన్నపేట మండలంలో ఒక జెడ్పీటీసీ స్థానానికి ఒకే నామినేషన్ దాఖలా కాగా 11 ఎంపీటీసీ స్థానాల కు ఎన్నికలు జరుగుతుండగా నాలుగు నామినేషన్ పత్రా లు దాఖలా అయ్యాయి. నర్సంపేట, సంగెం మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలకు రెండోరోజు కూడా దాఖలా కాలేదు. సంగెం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు గానూ నా లుగు నామినేషన్ పత్రాలు, నర్సంపేటలో 11 ఎంపీటీసీ స్థానాలకుగానూ 4 నామినేషన్ పత్రాలు దాఖలా అయ్యా యి. ఐదు మండలాల్లో పార్టీల వారీగా నామినేషన్ల దాఖలాను పరిశీలిస్తే రెండో రోజు మంగళవారం జెడ్పీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్ 4, బీజేపీ 1, ఇండిపెండెట్ అభ్యర్థి ఒక నా మినేషన్‌ను దాఖలా చేశారు. 62 ఎంపీటీసీ స్థానాలకు గానూ రెండో రోజు దాఖలా అయిన 35 నామినేషన్లలో టీ ఆర్‌ఎస్ 11, బీజేపీ 3, సీపీఐ (ఎం) 1, కాంగ్రెస్ 8, ఇండిపెండెంట్లు 12 మంది తమ నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.

నామినేషన్ల దాఖలాకు నేడు ఆఖరు..
జిల్లాలోని దుగ్గొండి, పర్వతగిరి, సంగెం, వర్ధన్నపేట, న ర్సంపేట మండలాల్లో మొదటి విడతలో భాగంగా ఎన్నిక లు జరగనున్నాయి. మే 6న ఎన్నికలు జరగనుండగా అధికారులు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. మొదటి, రెండు రోజు లు అధికారులను అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించగా బుధవారంతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. నర్సంపేట, సంగెం మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలకు మొ దటి రెండు రోజుల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖ లా చేయలేదు. బుధవారం సాయంత్రం 5 గంటలతో ఆఖ రు కావడంతో ఎన్నికలు జరగనున్న ఐదు మండలాల్లో నా మినేషన్ల దాఖలా చేసే అవకాశాలు ఉన్నాయి.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...