బాల్యవివాహాలు చేయడం నేరం


Wed,April 24, 2019 03:21 AM

-స్వయం కృషి సంస్థ సెక్రటరీ బెజ్జంకి ప్రభాకర్
నర్సంపేట రూరల్, ఏప్రిల్ 23: బాల్యవివాహాలు చేయడం నేరమని స్వయం కృషి సంస్థ సెక్రటరీ బెజ్జంకి ప్రభాకర్ అన్నారు. లక్నెపల్లి గ్రామ బుడిగజంగాల కాలనీలో మంగళవారం గ్రామ సర్పంచ్ గొడిశాల రాంబాబు అధ్యక్షతన స్వయం కృషి సంస్థ ఆధ్వర్యంలో బాలల శ్రేయస్సు పై అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ బాల్యవివాహాలు చేయడం వల్ల బాల ల హక్కులు హరించినట్లు అవుతుందన్నారు. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరిపించాలని కోరారు. బాల్యవివాహాల వల్ల చిన్న వయస్సులో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అంతేకాకుండా పుట్టబోయే పిల్లలు కూడా అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం వల్ల పిల్లల ఎదుగుదల లోపం, శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని వివరించారు. బాలల సమస్యలు లేని బాలల శ్రేయస్సు గ్రామంగా మార్చడానికి గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, మహిళా యువజన సంఘాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవగాహన సదస్సులో పస్తం లలిత, వీణ, కల్యాణి, మానస, రాజేశ్వరి, సమ్మక్క, యాకయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...