పంట ఎండితే పరిహారం అందిస్తా


Wed,April 24, 2019 03:21 AM

ఖానాపురం,ఏప్రిల్23 : పాకాల ఆయకట్టులో తైబందీ రైతుల పంటలు ఎండిపోతే ప్రత్యేక జీవో ద్వారా రైతులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు పాకాలలో సంగెం కాల్వకు నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన మోటార్ల పనితీరును ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకాల నీటిమట్టం 9 అడుగులకు చేరడంతో సంగెం కాల్వకు నీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు నీటి సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో ముందస్తుగానే పాకాలలో మోటార్ల ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. తైబందీ రైతులందరికీ చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. చివరి ఆయకట్టు రైతుల పంటలు ఎండిపోతే అధికారులతో సర్వే చేయించి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ప్రత్యేకంగా పరిహారం అందిస్తానని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని అన్నారు. మోటార్ల ద్వారా నీటిని అందిస్తున్నందున రైతులు సమన్వయంతో వ్యవహరించాలని, వరుస తడులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీరం సంజీవరెడ్డి, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, వేములపల్లి ప్రకాశ్‌రావు, కుంచారపు వెంకట్‌రెడ్డి, గుగులోతు రామస్వామినాయక్, వల్లెపు శ్రీనివాస్, ఇరుకు దేవేందర్‌రావు, ఉపేందర్‌రెడ్డి, బాబురావు, వెంకటనర్సయ్య, మస్తాన్, బాలు తదితరులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...