ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి


Wed,April 24, 2019 03:21 AM

-ఖానాపురం మండల కార్యకర్తల సమావేశంలో
మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
ఖానాపురం, ఏప్రిల్ 23 : రాబోయే మండల పరిషత్ ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని మండలంలో గులాబీ జెండాను ఎగురవేయాలని నియోజవర్గ ఎన్నికల ఇన్‌చార్జీ, మాజీ ఎంపీ గుండు సుధారాణి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిషత్ ఎన్నికలను నేపథ్యంలో మంగళవారం మండలకేంద్రంలో టీఆర్‌ఎస్ ముఖ్య కా ర్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండ ల పరిషత్ ఎన్నికల్లో విజయానికి ప్రతీ కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ఎన్నికల్లో అవకాశం రానివారు నిరాశపడకూడదని, వారికి సరైన సమయంలో అవకాశాలు కల్పించే బాధ్యత తనదేదన్నారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేదిలేదన్నారు. ఎవరు పోటీ చేసినా గెలుపు బాధ్యత అందరూ తీసుకోవాలన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిక
మాజీ ఎంపీ గుండుసుధారాణి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో మండలంలోని ధర్మరావుపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బిచ్యానాయక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే శక్తులన్నీ ఏకమవుతున్నాయన్నారు. కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు బీరం సంజీవరెడ్డి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు వేములపల్లి ప్రకాశ్‌రావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, వల్లెపు శ్రీనివాస్, రామస్వామినాయక్, బాలు, ఉపేందర్‌రెడ్డి, బాబురావు, మౌలానా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...