కాంగ్రెస్ శాయంపేట మండల కమిటీ


Wed,April 24, 2019 03:21 AM

-టీఆర్‌ఎస్‌లో విలీనం
ప్రకటించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి
శాయంపేట, ఏప్రిల్ 23 : కాంగ్రెస్ శాయంపేట మండలం కమిటీ టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు మెతుకు తిరుపతిరెడ్డి ప్రకటించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరారని ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తు ఆయన వెంటే తాము నడుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వెళ్లకుండా మైలారం రోడ్డులోని ఓ భవనంలో కాంగ్రెస్ మండల పార్టీ నాయకులతో కలిసి మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. మండలం నుంచి గండ్ర జ్యోతికి టీఆర్‌ఎస్ అధిష్టానం జెడ్పీటీసీగా టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో నాయకులు వైస్ ఎంపీపీ చిట్టిరెడ్డి జయపాల్‌రెడ్డి, ఆకుతోట సమ్మిరెడ్డి, పత్తిపాక సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, డీటీ రెడ్డి, కుడ్లె సుధాకర్‌రావు, కోసరి గోపాల్, మారెపల్లి నందం, దూదిపాల తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజిరెడ్డి, రేనుకుంట్ల సదయ్య, మనోహర్‌రెడ్డి, బొమ్మకంటి ఆనందం, చెన్నబోయిన అజయ్‌కుమార్, రాజు, రవిపాల్ పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...