బ్యాలెట్ బాక్సులు సిద్ధం


Tue,April 23, 2019 02:35 AM

- మూడు విడతల్లో పోలింగ్
- 16జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 4,86,607 మంది
- జిల్లా వ్యాప్తంగా 1,030 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
- అందుబాటులో మూడు రకాల 2,505 బ్యాలెట్ బాక్సులు
- రక్షిత ప్రాంతాల్లో భద్రపరిచిన అధికారులు
- తొలి విడతలో ఐదు మండలాల్లో ఎన్నికలు

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లలో అధికారయంత్రాంగం వేగం పెంచింది. దీనిలో భాగంగానే ఇప్పటివరకు పోలింగ్ కేంద్రాల పరిశీలన, సౌకర్యాల కల్పన తదితర విషయాలపై కసరత్తు పూర్తిచేసింది. మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఎన్నికల ఏర్పాట్లను అధి కారులు చకచకా కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగానే వరంగల్ రూరల్ జిల్లాలో 16 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో ఐదు మండలాలు, రెండో విడతలో ఆరు మండలాలు, మూడో విడతలో ఐదు మండలాల్లో పోలింగ్ ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. 178 ఎంపీటీసీ స్థానాలతోపాటు 16 జెడ్పీటీసీ స్థానాలకు పార్టీ గుర్తులపై, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగనున్నాయి.

ఈ మేరకు అవసరమైన బ్యాలెట్ బాక్సుల కోసం జిల్లాలో అందుబాటులో ఉన్నవాటికి తోడుగా ఇతర ప్రాంతాల నుంచి కూడా తెప్పించారు. పది శాతం బ్యాలెట్ బాక్సులను అదనంగా అందుబాటులో ఉంచారు. ఓట్ల లెక్కింపును వచ్చే నెల 27న జరపనున్న నేపథ్యంలో పోలింగ్ నిర్వహించిన తర్వాత బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి ఇప్పటికే గుర్తించిన స్ట్రాంగ్‌రూంల్లో భద్రపర్చనున్నారు. ఈ మూడు విడతల ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా మొత్తంలో 4,86,607 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం జిల్లావ్యాప్తంగా 1030 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 1545 పెద్ద బ్యాలెట్ బాక్సులు, 480 మీడియం సైజు బ్యాలెట్ బాక్సులు, 480 చిన్న బ్యాలెట్ బాక్సులు అవసరంగా గుర్తించారు. మొత్తం జిల్లాలో మూడు విడతల్లో జరిగే ఎన్నికలకు 2505 బ్యాలెట్ బాక్సులను అవసరంగా గుర్తించి, బాక్సులను తెప్పించి అందుబాటులో ఉంచారు. ఈ బ్యాలెట్ బాక్సులన్నింటినీ సంబంధిత మండల కేంద్రాల్లోని రక్షిత ప్రాంతాల్లో భద్రపరిచారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...