పాఠశాలల వివరాలను ఆన్‌లైన్‌లో పూర్తిచేయాలి


Tue,April 23, 2019 02:31 AM

- ఇన్‌చార్జి డీఈవో పెగడ రాజీవ్
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని పాఠశాలల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులను ఇన్‌చార్జి డీఈవో పెగడ రాజీవ్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా వెబ్‌సైట్‌లో అంశాల వారీగా వివరాలను పూర్తిచేయాలని పేర్కొన్నారు. చైల్డ్ ఇన్ఫో, యూడైస్, టీచర్ ఆన్‌లైన్ డేటా, సీసీఈ, రీమెడియల్ టీచింగ్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, పీఎంఎస్ వెబ్‌పోర్టల్‌తోపాటు 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రతీ గ్రాంట్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారమే పాఠశాలలకు బడ్జెట్ కేటాయించనున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు ఆయా మండలాల పరిధిలోని ఎంఆర్‌సీ కార్యాలయాల్లో ఈ నెల 24వ తేదీ వరకు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఎంఐఎస్, సీసీవో, సీఆర్‌పీ, ఐఈఆర్‌పీలు సంబంధిత క్లస్టర్ పాఠశాలల ఆన్‌లైన్ డేటాను పూర్తి చేసేవరకు సంబంధిత మండల విద్యాశాఖ అధికారుల అనుమతులు లేకుండా గైర్హాజరు కాకూడదని డీఈవో వివరించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...