మేడారం జాతర తేదీలు ఖరారు


Mon,April 22, 2019 02:59 AM

-వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు మహాజాతర
-వేడుకలకు సిద్ధమవుతున్న గిరిజన పూజారులు
తాడ్వాయి, ఏప్రిల్ 21 : ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్కల మహాజాతర తేదీలను ఆదివారం పూజారులు ఖరారు చేశారు. ఈ మేరకు వనదేవతల గద్దెల ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల మహాజాతర జరిగే తేదీలపై చర్చించుకున్న అనంతరం 2020 ఫిబ్రవరి మాసంలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అమ్మవార్ల మహాజాతరను నిర్వహించేందుకు నిర్ణయించారు. 5న సారక్క దేవత, గోవిందరాజు, పగిడ్దిరాజులు గద్దెలపైకి చేరుట, 6న సమ్మక్క దేవత చిలకలగుట్ట నుంచి గద్దెపై కొలువుదీరుట, 7న అమ్మవార్ల గద్దెలకు భక్తుల మొక్కులు, 8న దేవతల వనప్రవేశం కార్యక్రమాలు నిర్వహించడానికి పూజారులు నిర్ణయించారు. అమ్మవార్ల మహాజాతర విజయవంతం అయ్యేందుకు పూజారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన పనులు, తల్లులు గద్దెలపైకి చేరుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకున్నారు. కార్యక్రమంలో పూజారులు సిద్ధబోయిన మునిందర్, మహేశ్, లక్ష్మణ్‌రావు, కొక్కెర కృష్ణయ్య, చందా బాబురావు, కాక సారయ్య, కిరణ్‌కుమార్, కనకమ్మ, లక్ష్మింబాయమ్మ, భుజంగరావు, కాక వెంకటేశ్వర్లుతో పాటు పూజారుల కుటుంబ సభ్యులు గోపాల్‌రావు, భోజరావు, అనిల్, స్వామి, వసంతరావు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...