పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేయాలి


Mon,April 22, 2019 02:57 AM

-జిల్లా కలెక్టర్ ఎం హరిత
-బిట్స్ కళాశాలలోని స్ట్రాంగ్ రూం,
-కౌంటింగ్ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్
నర్సంపేట రూరల్, ఏప్రిల్ 21 : పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరిత అధికారులను ఆదేశించచారు. నర్సంపేట డివిజన్ పరిధిలోని 6 మండలాలకు జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామ శివారు బిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్‌ను ఆదివారం కలెక్టర్ హరిత పరిశీలించారు. డీఆర్డీవో సంపత్‌రావు, నర్సంపేట ఆర్డీవో రవి, ఏసీపీ సునీతామోహన్, డివిజన్‌లోని పలువురు ఎంపీడీవోలతో కలిసి కలెక్టర్ స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ హాల్‌కు సంబంధించిన పక్కా లేవుట్ ప్రక్రియను రేపటి వరకు పూర్తి చేయాలని ఎంపీడీవోలకు సూచించారు. అలాగే స్ట్రాంగ్ రూంకు సంబంధించిన బందోబస్తు గురించి ఏసీపీ సునీతామోహన్‌కు పలు సూచనలు చేశారు. బిట్స్ కళాశాలలోని జూనియర్ కళాశాల, టెక్నో స్కూల్‌లో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్ ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పరిషత్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని తెలిపారు. పరిషత్ ఎన్నికలు ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట పరిషత్ ఎన్నికల లైజనింగ్ ఆఫీసర్ సంపత్‌రావు, జెడ్పీ సూపరిండెంట్ శ్రీనివాస్, డివిజన్‌లోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, సీఐలు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు తదితరులున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...