అభ్యర్థుల ఖరారుకు కసరత్తు


Mon,April 22, 2019 02:57 AM

-ఆశావాహుల పేర్లు హైదరాబాద్‌కు
-ఎంపీటీసీ పోటీదారుల
-విజయ అవకాశాలపై సర్వేలు
-గెలుపు గుర్రాలకే టికెట్లు
-పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల నియోజకవర్గంలో గె లుపు గుర్రాలకే టికెట్లు అందజేయడంతోపాటు అన్ని మండలా ల్లో గట్టి పోటీ ఉండడంతో జెడ్పీటీసీ అభ్యర్థుల పేర్ల ఖరారు బా ధ్యతను పార్టీ రాష్ట్ర కమిటీకి అప్పగిస్తూ ఆశావాహుల పేర్లను అధిష్టానానికి చేరవేసినట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తె లిపారు. తెలంగాణ రాష్ట్ర సమితికి గట్టి పట్టున్న పరకాల నియోజకవర్గంలో అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితాలను మండలాల వారీగా సిద్ధం చేసి పార్టీ రాష్ట్ర కమిటీఇకి నివేదించినట్లు ఆదివారం తనను కలిసిన నియోజకవర్గంలోని పలు మండలాల ముఖ్యనాయకులతో ఎమ్మెల్యే ధర్మారెడ్డితోపాటు పరిశీలకులు పులి సారంగపాణి చెప్పారు.
మండలాల వారీగా సమీకరణలు, అవకాశాలపై చర్చించిన వీరిరువురు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అప్పగించినట్లు చెప్పారు. వివిధ మార్గాల ద్వారా అభ్యర్థుల స్థితిగతులు, పార్టీకి చేసిన సేవ, ఉద్యమానికి అందించిన చేయూత, వివిధ సందర్భాల్లో జరిగిన ఎన్నికల్లో వారు చేసిన కృషిని పరిగణలోకి తీసుకుని ప్రజల్లో వారికున్న బలాన్ని బేరీజు వేసి జెడ్పీటీసీ అభ్యర్థిత్వాలను రాష్ట్ర పార్టీ ఖరారు చేసిందని చెప్పారు. ఇక ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆశావాహుల పనితీరు, గ్రామాల్లో వారికున్న పట్టు, ప్రజల్లో వారికున్న ఆదరణను పరిగణలోకి తీసుకుని సర్వే నివేదికలు అందాక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్లు, ముఖ్యులతో కూడా సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...